రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సమంత
- సెర్బియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి..
- సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశంలోనే ఉన్న సమంత
- ప్రెసిడెంట్ ముర్మును కలుసుకున్న సిటాడెల్ టీమ్
గౌరవనీయులైన భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ వరుణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఫొటోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వరుణ్ ధావన్, సమంత ఉన్నారు. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సమంత.. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ భారతీయ వెర్షన్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.