Chiranjeevi: 'భోళాశంకర్' రిలీజ్ డేట్ వాయిదా?

  • 'భోళా శంకర్'గా చిరంజీవి 
  • మాస్ కంటెంట్ తో రానున్న మెగాస్టార్ 
  • ఆశించిన స్థాయిలో పూర్తికాని షూటింగ్ 
  • రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని టాక్
Bhola Shankar Movie Update

మెగా అభిమానులంతా ఇప్పుడు 'భోళా శంకర్' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహితి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మాస్ టైటిల్ ... పోస్టర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 

ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఆ తేదీకి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చని అంటున్నారు. సెకండాఫ్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు .. రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నారు. రిలీజ్ డేట్ లోగా వాటిని పూర్తిచేసే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక పవన్ - సాయితేజ్ చేసిన 'బ్రో' సినిమా జులై 28న విడుదలవుతోంది. ఆ సినిమాకి కొంత గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా చిరంజీవి ఉన్నారని అంటున్నారు. అందువలన 'భోళా శంకర్' సినిమా విడుదల తేదీ వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయవలసిందే.

More Telugu News