ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. నల్లటి రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగిన భారత్, ఆసిస్ ఆటగాళ్లు
- ఒడిశా రైలు ప్రమాదంలో 270 మందికి పైగా మృతి
- సంతాప సూచకంగా భుజానికి నల్ల రిబ్బన్లు ధరించిన ఆటగాళ్లు
- అంతకుముందు మౌనం పాటించి నివాళులు
ఇటీవల ఒడిశాలో ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ తెలిసిందే. ఈ ఘటనలో 270 మందికి పైగా మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో వారి మృతికి సంతాప సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు. మొదట కాసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు.