Balakrishna: బాలయ్య 108వ సినిమా టైటిల్ ను లాంచ్ చేసేది ఆ రోజునే!

  • షూటింగు దశలో బాలయ్య 108వ సినిమా
  • కథానాయికగా కనిపించనున్న కాజల్  
  • ఈ నెల 8వ తేదీన టైటిల్ లాంచ్ 
  • దసరాకి సినిమా విడుదల  
Balakrishna 108 Movie Update

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 108వ సినిమా. ఈ సినిమాకి ఫలానా టైటిల్ ను ఖరారు చేశారంటూ ఈ మధ్య కొన్ని టైటిల్స్ షికారు చేశాయి .. కానీ అదంతా కేవలం ప్రచారం మాత్రమే అనే విషయం తేలిపోయింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేశారట. ఈ నెల 8వ తేదీన టైటిల్ లాంచ్ ఈవెంటును నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ నెల 10వ తేదీన బాలయ్య బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేస్తున్నారు.

బాలకృష్ణ జోడీగా కాజల్ నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తన మార్క్ కామెడీ చాలా తక్కువగా ఉంటుందనీ, బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిల్ రావిపూడి ఇంతకుముందే చెప్పాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News