ముందస్తు అయినా, వెనకస్తు అయినా టీడీపీదే గెలుపు.. తమ్మినేని పందిలా బలిశారు: బుద్ధా వెంకన్న
- చచ్చే వరకు టీడీపీలోనే ఉంటానని తమ్మినేని చెప్పారన్న బుద్ధా
- వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని వ్యాఖ్య
- 600 ఎకరాల్లో విజయసాయి, అమర్నాథ్ బినామీ పేర్లతో వెంచర్లు వేశారని ఆరోపణ
తల్లి పేరు చెప్పుకుని అవినాశ్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ కంటే జగనే ఎక్కువ భయపడుతున్నారని చెప్పారు. జనాల దగ్గరకు డేరాలు కట్టుకుని వెళ్లే జగన్ డేరాబాబా అని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, వెనకస్తు ఎన్నికలు వచ్చినా గెలిచేది టీడీపీనే అని చెప్పారు.
వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల్లో పేదలకు జగన్ ఇంటి స్థలాలు ఇవ్వాలని వెంకన్న డిమాండ్ చేశారు. 600 ఎకరాల్లో విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్ నాథ్ లు బినామీ పేర్లతో వెంచర్లు వేశారని చెప్పారు. ఆ స్థలాలు కొని ఎవరూ మోసపోద్దని సూచించారు.