Advertisement

యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. ‘మేమ్ ఫేమస్’కు రాజమౌళి ప్రశంస

ss rajamouli praises memfamous film and the director
  • యువకులంతా కలిసి చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’
  • బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న చిత్రం
  • ఇటీవల అభినందించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు 
  • చాలా కాలం తర్వాత థియేటర్‌లో సినిమాని ఎంజాయ్ చేశానని తాజాగా రాజమౌళి ట్వీట్
యువకులంతా కలిసి చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. గతవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. యువ దర్శకుడు సుమంత్ ప్రభాస్ తానే హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రముఖ హీరోలతో ప్రమోషన్లు కూడా వినూత్నంగా నిర్వహించారు. ఇటీవల ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు మెచ్చుకోగా.. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు.

చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశానని రాజమౌళి ట్వీట్ చేశారు. దర్శకుడు సుమంత్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుమంత్ కోసం సినిమా చూశానని, నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయని, నటీనటులు సహజంగా నటించారని ప్రశంసించారు. ముఖ్యంగా అంజి మామ పాత్ర బాగా నచ్చిందని తెలిపారు. ఈ సినిమాని అందరూ చూడాలంటూ ‘హైలీ రికమండెడ్’ అని రాసుకొచ్చారు. ‘‘యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. అంతే గానీ ధమ్ ధమ్ చెయ్యొద్దు’’ అని చెప్పారు.
Advertisement
Mem Famous
Rajamouli
Sumanth Prabhas
Mahesh Babu

More Telugu News