నాలుగు నెలల క్రితం అదృశ్యమైన బ్రెజిల్ నటుడు.. చంపి చెక్కపెట్టెలో పెట్టి పూడ్చేశారు!
- భూమికి ఆరు అడుగుల లోతున చెక్కపెట్టెలో పూడ్చివేత
- చేతులు తల వెనకకు కట్టి ఉన్నాయన్న న్యాయవాది
- జెఫర్సన్ అంటే అసూయపడే వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆవేదన
- నిందితుడు చివరిసారి నెల రోజుల క్రితం పూడ్చివేసిన ఇంటి వద్ద కనిపించిన వైనం
జెఫర్సన్ చేతులు తల వెనకకు కట్టివేసి ఉన్నాయని ఆయన కుటుంబ న్యాయవాది తెలిపారు. వేలి ముద్రల ద్వారా మృతదేహాన్ని గుర్తించామని, మెడపై ఓ గీత కూడా ఉందని, గొంతుకోసి హత్య చేసినట్టుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. జెఫర్సన్ అంటే అసూయపడే, దుష్టులైన వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు చివరిసారి నెల రోజుల క్రితం ఆ ఇంట్లో కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తికి జెఫర్సన్ బాగా తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని అనుమానిస్తున్నారు.