షూటింగ్ కోసం వచ్చి.. హోటల్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి దర్శకుడు
- ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఘటన
- చిత్రబృందంతో కలిసి హోటల్‌లో బస
- ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న పోలీసులు
ఇటీవలి కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరణాలు ఎక్కువయ్యాయి. పాప్యులర్ టీవీ నటుడైన నితీశ్ పాండే రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఓ హోటల్‌లో మృతి చెంది కనిపించారు. షూటింగ్ నిమిత్తం మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో ఓ హోటల్‌లో బస చేసిన ఆయన చనిపోయారు. ఈ నెల 22న బుల్లితెర యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరణించారు. ఆ తర్వాతి రోజే ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.