Blakrishna: బాలయ్య - కాజల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ!

  • 108వ సినిమా షూటింగులో బాలయ్య 
  • ఆయన సరసన నాయికగా కాజల్ సందడి 
  • కూతురు పాత్రలో కనిపించనున్న శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • దసరాకి సినిమా విడుదల 
Balayya 108 movie update

బాలకృష్ణ తన 108వ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. సన్ షైన్ స్క్రీన్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా కాజల్ నటిస్తుండగా, ఆయన కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. 

ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ - నానక్ రామ్ గూడా పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. అక్కడ బాలయ్య - కాజల్ కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

'అఖండ' .. 'వీరసింహారెడ్డి' వంటి భారీ హిట్స్ తరువాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఇక అనిల్ రావిపూడి నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి సినిమా హిట్టే కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

More Telugu News