Jr NTR: రవితేజ 'కిక్' ఎన్టీఆర్ చేయవలసిందట!

  • 'కిక్' కథను ముందుగా విన్న ఎన్టీఆర్ 
  • అంతకుముందు 'అశోక్' ఫ్లాప్ చూసిన ఎన్టీఆర్ 
  • అందుకే సురేందర్ రెడ్డికి పడని గ్రీన్ సిగ్నల్ 
  • రవితేజ పట్టుకుపోయిన హిట్
Ntr Special

సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి సినిమాల జాబితాలో 'కిక్' ముందు వరుసలో కనిపిస్తుంది. ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన ఈ సినిమా, రవితేజ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. 

సురేందర్ రెడ్డి ముందుగా ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే అంతకుముందు .. అంటే 2006లో ఆయనతో చేసిన 'అశోక్' సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి కూడా వక్కంతం వంశీనే కథను అందించాడు. ఆ సినిమా పరాజయం పాలైంది.  ఇక ఈ ఇద్దరూ 2007లో మహేశ్ బాబుతో చేసిన 'అతిథి' కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 

ఈ కారణంగానే 2009లో 'కిక్' చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదట. అప్పుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రవితేజతో చేయడం .. ఆ సినిమా సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో అభిమానులు ఉన్నారు. 

More Telugu News