Allu Arjun: ‘అతడు ఈ సారి ప్రతీకారంతో తిరిగి వస్తాడు’.. పుష్ప-2 క్రేజీ అప్ డేట్!

a key schedule of pushpa 2 completed
షార్ట్స్‌లో చూడండి
రెండేళ్ల కిందట థియేటర్లలో సందడి చేసింది ‘పుష్ప’. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదలై సంచలన కలెక్షన్లు సాధించింది. ఇక ఈ సినిమాలోని మ్యానరిజమ్స్ బన్నీని పాన్ ఇండియా హీరోని చేసేశాయి.

ఇప్పుడు రెండో భాగం రెడీ అవుతోంది. బాక్సాఫీస్ ను ‘రూల్’ చేసేందుకు ‘పుష్ప: ది రూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ‘భన్వర్ సింగ్ షెకావత్’.. అదేనండీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారట.

ఈ మేరకు షూటింగ్‌ లొకేషన్‌లో డైరెక్టర్ సుకుమార్, ఫహాద్‌ మానిటర్‌ స్క్రీన్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు. పుష్పలో బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్‌ షెకావత్‌దే. ఫహాద్‌ ఫాజిల్‌ ఈ పాత్రలో కనిపించేది కొద్దిసేపే అయినా ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ తన నటనతో అదరగొట్టేశాడు. సెకండ్‌ పార్ట్‌లో ఆయన పాత్ర వేరే లెవల్లో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక నటిస్తోంది. మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మేనరిజమ్స్, పాటలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల దాకా ప్రతి ఒక్కరూ అవకాశం చిక్కినప్పుడల్లా ‘తగ్గేదే లే’ డైలాగ్స్ చెప్పేశారు. ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి’ పాట.. ‘ఊ అంటావా’ అంటూ సమంత ఆట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప ఎక్కడ’ అంటూ విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. పుష్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, గొడవలు, అతడి కోసం వెతుకులాట వంటివి అందులో చూపించారు. ‘‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే దాని అర్థం పులి వచ్చిందని.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే.. పుష్ప వచ్చాడని అర్థం’’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
Go Back to Shorts
Allu Arjun
sukumar
Pushpa
Pushpa the rule
Bhanwar Singh Shekhawat
Fahadh Faasil
Rashmika Mandanna

More Telugu News