Vijay Antony: విజయ్ ఆంటోని కాకుండా 'బిచ్చగాడు 2'కి ఈ ఇద్దరు స్టార్స్ సెట్ అవుతారట!

  • విజయ్ ఆంటోని నుంచి 'బిచ్చగాడు 2'
  • ఈ నెల 19వ తేదీన సినిమా రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ ఆంటోని  
  • తను చేసిన పాత్రకు మహేశ్ - విజయ్ కరెక్ట్ అని వెల్లడి  
Bichagadu 2 movie update

విజయ్ ఆంటోని హీరోగా గతంలో వచ్చిన 'బిచ్చగాడు' తమిళంతో పాటు తెలుగులోను సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక అనువాద చిత్రానికి రికార్డుస్థాయి వసూళ్లు రావడం ఈ సినిమా విషయంలో జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టు 2 కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన 'బిచ్చగాడు 2' థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఆంటోని బిజీగా ఉన్నారు. తెలుగు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాత్రను చేయడం నటుడిగా తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాను కాకుండా ఈ పాత్రను తెలుగులో మహేశ్ బాబు .. తమిళంలో విజయ్ చేస్తే కరెక్టుగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సినిమాకి ఆయన దర్శక నిర్మాతగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అందువలన ఆ ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. 'బిచ్చగాడు' తరువాత సరైన హిట్ లేని విజయ్ ఆంటోనికి, 'బిచ్చగాడు 2'తో మళ్లీ బ్లాక్ బస్టర్ పడుతుందేమో చూడాలి. 

More Telugu News