శబరిమల అయ్యప్ప కొలువైన పొన్నాంబళమేడు అటవీ ప్రాంతంలో అక్రమంగా పూజలు!
- మరో నలుగురితో కలిసి పూజలు చేసిన తమిళనాడు వ్యక్తి నారాయణస్వామి
- వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన అటవీ అధికారులు
- తాను ఎక్కడికెళ్తే అక్కడ పూజలు చేస్తుంటానన్న నారాయణస్వామి
- గతంలో హిమాలయాల్లోనూ పూజలు చేశానని వెల్లడి
అయితే, నారాయణస్వామి మాత్రం తాను అటవీ అధికారుల అనుమతితోనే పొన్నాంబళమేడు చేరుకుని పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నాడు. తాను త్రిసూర్ పక్కనున్న వడక్కుమ్‌నాథన్ ఆలయంలో ఉంటానని, గతంలో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశానని ‘మనోరమ ఆన్‌లైన్’కు తెలిపాడు. తాను భక్తుడినని, ప్రతి సంవత్సరం శబరిమల సందర్శిస్తుంటానని చెప్పాడు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ పూజలు చేస్తుంటానని, గతంలో హిమాలయాల్లోనూ పూజలు నిర్వహించినట్టు తెలిపాడు. పొన్నాంబళమేడు హై సెక్యూరిటీ ప్రాంతమని తనకు తెలియదని, ఇప్పటి వరకు పోలీసులు కానీ, అటవీ అధికారులు కానీ ఎవరూ తనను సంప్రదించలేదని పేర్కొన్నాడు.