'ఏజెంట్' వలన ఇంతపెద్ద నష్టం జరిగిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఏజెంట్' వలన ఇంతపెద్ద నష్టం జరిగిందట!

Agent Movie Update
  • ఏప్రిల్ 28వ తేదీన వచ్చిన 'ఏజెంట్'
  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా 
  • అదే స్థాయిలో వచ్చిన నష్టాలు 
  • అనిల్ కుమార్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్', ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నిజానికి సురేందర్ రెడ్డి ఫస్టులుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచాడు. అఖిల్ వెయిట్ చేస్తున్న హిట్ ఈ సినిమాతో పడటం ఖాయమని అంతా అనుకున్నారు.

అయితే అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతమాత్రం అందుకోలేకపోయింది. వీకెండ్ లోనే వసూళ్లు తగ్గడం కనిపించింది. కథాకథనాలపై అఖిల్ దృష్టిపెట్టలేదని కొంతమంది అంటే, సురేందర్ రెడ్డి మార్కు కనిపించలేదని మరికొంతమంది అన్నారు. అలా ఈ సినిమా వసూళ్ల పరంగా పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. 

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ 13.35 కోట్ల గ్రాస్ .. 6.90 కోట్ల షేర్ గా ఉందని సమాచారం. జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే మొత్తంగా ఈ సినిమా 36.20 కోట్లను రాబట్టవలసి వుంది. అలాంటి ఈ సినిమా 30.10 కోట్ల నష్టాలను చవిచూసిందని అంటున్నారు. ఇక యూవీ బ్యానర్లో కొత్త దర్శకుడైన అనిల్ కుమార్ తో అఖిల్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

Advertisement
Akhil
Surendar Reddy
Anil Kumar

More Telugu News