15న రామ్–బోయపాటి చిత్రం ఫస్ట్ థండర్

Boyapati and Ram first thunder on monday
  • తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం
  • ఈ రోజు కొత్త పోస్టర్ విడుదల
  • రామ్ బర్త్ డే సందర్భంగా 15న రానున్న ఫస్ట్ గ్లింప్స్ 
రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. 'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టాలీవుడ్ లో జోరుమీదున్న శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం .. బోయపాటి స్టయిల్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ శనివారం సినిమా నుంచి రామ్ మాస్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో రామ్ బేస్ బాల్ స్టిక్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. 15న ఉదయం 11.25 గంటలకు ఫస్ట్ థండర్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Advertisement
ram potineni
Boyapati Sreenu
May 15
first glimps
sreeleela

More Telugu News