ఆ నిర్వచనం ప్రకారం పవిత్రతో నా పెళ్లయిపోయినట్లే: నరేశ్
- తాము పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
- నరేశ్, పవిత్ర జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’
- ఈ నెల 26న విడుదల కానున్న సినిమా
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నరేశ్.. పవిత్రతో తన పెళ్లి వార్తలపై స్పందించారు. తనకు వివాహ వ్యవస్థపై గొప్ప నమ్మకం ఉందన్నారు. పెళ్లి గొప్పతనాన్ని ఈ సినిమాలో తెలియజెప్పామని, కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరిందని అన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎన్.బాల్‌రెడ్డి డీఓపీగా వ్యవహరించగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.