అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్
- 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ
- కూతురు హీరోయిన్ గా 'కొత్త రంగుల ప్రపంచం' సినిమాకు దర్శకత్వం
- సినిమా ప్రమోషన్స్ లో అస్వస్థతకు గురైన పృథ్వీ
విడుదలకు సిద్ధంగా వున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆసుత్రికి తరలించారు. తాను కోలుకుంటున్నానని పృథ్వీ చెప్పారు. దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నానని తెలిపారు. కొత్త రంగుల ప్రపంచం సినిమాకి అందరి ఆశీస్సులు కావాలని కోరారు.