Junior Silk Smitha: సిల్క్ స్మిత మాదిరిగానే క్రేజ్ తెచ్చుకోవాలనుంది: జూనియర్ సిల్క్ స్మిత

  • వెండితెరపై ఒక వెలుగువెలిగిన సిల్క్ స్మిత
  • ఇప్పటికీ ఆమెను మరిచిపోని అభిమానులు 
  • ఆమె పోలికలతో పాప్యులర్ అవుతున్న జూనియర్ సిల్క్ స్మిత 
  •  యాక్టింగ్ ప్రొఫెషన్ లో ముందుకు వెళ్లనున్నట్టు వెల్లడి   
Junior Silk Smitha Interview

ఒకప్పుడంటే హీరోలను పోలినవారు బయటివారికి తెలియడానికి టీవీ ఛానల్స్ కొన్ని ప్రత్యేకమైన కాన్సెప్ట్ లను డిజైన్ చేసేవి. అలాంటి కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వచ్చిన తరువాత హీరోయిన్స్ ను పోలినవారు బాగా పాప్యులర్ అవుతున్నారు. వాళ్లు చేసే వీడియోస్ కీ .. రీల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా పాప్యులర్ అయినవారిలో జూనియర్ సిల్క్ స్మిత ఒకరు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. 'నువ్వు అచ్చం సిల్క్ స్మితలా ఉన్నావ్' అని మా ఇంట్లో వారు అనడం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలేజ్ లోను అనడం మొదలైంది. అప్పుడే నేను సిల్క్ స్మితగారిని గురించి తెలుసుకున్నాను. ఆమె తమిళ సినిమాలను చూసి టిక్ టాక్ .. రీల్స్ .. వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. అలా నేను పాప్యులర్ అయ్యాను" అని అన్నారు. 

"ఇంతకాలం మాతో ఉన్నావ్ .. నీ వీడియోస్ కి ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదని కాలేజ్ ఫ్రెండ్స్ అనేవారు. నాకు ఇంత పేరు వస్తుందని నేను కూడా అనుకోలేదు. సిల్క్ స్మితను మిస్సవుతున్నామనుకునేవారు ఎక్కువగా ఉండటం వల్లనే నన్ను ఆదరిస్తున్నారు. ఆమె మాదిరిగా ఈ ప్రొఫెషన్ లో ముందుకువెళ్లడానికి నేను రెడీగానే ఉన్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News