Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల

Romantic song from Malli Pelli movie out now
షార్ట్స్‌లో చూడండి
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రం నుంచి 'రా రా హుజూరు నాతో' అనే రొమాంటిక్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అరుళ్ దేవ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. గాయని ఇందు సనత్ ఈ గీతాన్ని ఆలపించారు.

'మళ్లీ పెళ్లి' చిత్రం నటుడు నరేశ్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు నరేశ్ నిర్మాత. 'మళ్లీ పెళ్లి' చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Malli Pelli
Song
Naresh
Pavitra Lokesh
MS Raju
Tollywood

More Telugu News