అండగా ఉంటా: రెజ్లర్లకు పీటీ ఉష భరోసా
- రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్ల ఆందోళన
- కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా
- రెజ్లర్లను కలిసిన పీటీ ఉష
పీటీ ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ... రెజ్లర్లకు అండగా ఉండి న్యాయం చేస్తానని పీటీ ఉష తమతో చెప్పారని అన్నారు. సమస్యను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.