Gopichand: 'రామబాణం' నుంచి హుషారైన బీట్ రిలీజ్!

  • శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 'రామబాణం'
  • గోపీచంద్ కాంబినేషన్లో ఆలయానికి ఇది మూడో సినిమా 
  • కథానాయికగా అందాల సందడి చేయనున్న డింపుల్ 
  • సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ 
  • మే 5వ తేదీన సినిమా విడుదల
Ramabanam  lyrical song released

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'రామ బాణం'  సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి కనువిందు చేయనుంది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'నువ్వే నువ్వే' అంటూ సాగే ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'మొదటిసారిగా మనసుపడి .. వదలకుండ నీ వెంటపడి  .. మొదలైంది నా గుండెల్లో లవ్ మెలోడీ' అంటూ ఈ పాట మొదలవుతోంది. గోపీచంద్ - డింపుల్ హయతిపై ఈ పాటను విదేశాల్లో  చిత్రీకరించారు. 

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రితేశ్ ఆలపించాడు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీని అందించాడు.  జగపతిబాబు .. ఖుష్బూ .. తరుణ్ అరోరా ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా హిట్ అనే మాటకి దూరంగా ఉన్న గోపీచంద్ కి , ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News