ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్జున్ టెండూల్కర్.. వీడియో ఇదిగో
- ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్న అర్జున్
- ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో ముంబై బౌలర్‌గా చెత్త రికార్డు
- తొలి స్థానంలో డేనియల్ శామ్స్
నిజానికి పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్జున్ తన బౌలింగ్‌ను బ్రహ్మాండంగా ప్రారంభించాడు. తొలి ఓవర్‌లోనే జోరుమీదున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వెనక్కి పంపాడు. ఐపీఎల్‌లో అర్జున్‌కి ఇది రెండో వికెట్. అయితే, ఆ తర్వాత 16వ ఓవర్ వేసిన అర్జున్ ఎడాపెడా పరుగులు ఇచ్చుకున్నాడు. అర్జున్ వేసిన తొలి బంతినే శామ్ కరన్ స్టాండ్స్‌లోకి పంపి ఉద్దేశాన్ని చాటిన పంజాబ్ కెప్టెన్.. ఆ తర్వాత కూడా ఫోర్లు, సిక్సర్‌తో విరుచుకుపడి 31 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, ఓ నోబాల్ ఫోర్, వైడ్ ఉన్నాయి. మొత్తంగా మూడు ఓవర్లు వేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకుని 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇందులో ఒక నోబాల్, 4 వైడ్లు కూడా ఉన్నాయి.