రంజాన్ సందర్భంగా చిరంజీవిని కలిసిన అలీ సోదరులు
Add ap7am to your home Screen

రంజాన్ సందర్భంగా చిరంజీవిని కలిసిన అలీ సోదరులు

Ali and his brother Khayyum met Chiranjeevi on Ramadan day
  • కమెడియన్ అలీ ఇంట పండుగ
  • కుటుంబ సభ్యులతో కలిసి చిరంజవి వద్దకు వెళ్లిన అలీ, ఖయ్యూం
  • రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
ఇవాళ ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పర్వదినం. ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ, ఆయన సోదరుడు ఖయ్యూం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అలీ రాకపై చిరంజీవి స్పందించారు. ఈ రంజాన్ పండుగను ఆలీ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.  

ఈ భేటీపై ఆలీ మాట్లాడుతూ, తమకు ఎంతో ముఖ్యమైన పండుగ రంజాన్ అని, ఈ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కాగా, చిరంజీవి తన కొత్త చిత్రం షూటింగ్ లో ఉండగా... అలీ, ఖయ్యూం ఆయనను కారవాన్ లో కలిసినట్టు తెలుస్తోంది.
Advertisement
Chiranjeevi
Ali
Khayyum
Ramadan
Tollywood

More Telugu News