Dokka Manikya Varaprasad: మంత్రి ఆదిమూలపు సురేశ్ అంతు చూస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్

Dokka Manikya Varaprasad fires on TDP Chief Chandrababu
షార్ట్స్‌లో చూడండి
యర్రగొండపాలెం ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ పై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. ఆదిమూలపు సురేశ్ చేసిన డిమాండ్ పై స్పష్టత ఇవ్వాల్సింది పోయి, అంతు చూస్తానంటూ చంద్రబాబు బెదిరించడం సరికాదని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

దళితులపై చంద్రబాబు తన వైఖరేంటో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఘర్షణలు సృష్టించాలనుకోవడం సరికాదని డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ కు భద్రత కల్పించాలని ఆయన పేర్కొన్నారు. 

దళితులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు.
Go Back to Shorts
Dokka Manikya Varaprasad
Chandrababu
Adimulapu Suresh
Yerragondapalem
YSRCP
TDP

More Telugu News