'లవ్ టుడే' బ్యూటీ హీరోయిన్ గా 'సెల్ఫిష్'
- ఆశిష్ హీరోగా రూపొందుతున్న 'సెల్ఫిష్'
- హైదరాబాద్ నేపథ్యంలో నడిచే కథ
- దర్శకత్వం వహిస్తున్న విశాల్ శివ
- సంగీతాన్ని అందిస్తున్న మిక్కీ జె మేయర్
విశాలమైన కళ్లతో ఇవాన చేసిన విన్యాసాలకు కుర్రాళ్లు మనసులు పారేసుకున్నారు. ఆ తరువాత ఆమె వరుస తమిళ సినిమాలతోనే బిజీ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఆమె ఒక తెలుగు సినిమా చేస్తోంది .. ఆ సినిమా పేరే 'సెల్ఫిష్'.
ఈ సినిమాలో ఆమె ఆశిష్ జోడీగా 'చైత్ర' పాత్రలో అలరించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటికి క్రితం విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, దిల్ రాజు - సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఇవాన టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూడాలి.