Amit Shah: ఎల్లుండి హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు తేనీటి విందు   

Amit Shah to hold tea party to RRR team in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయింది. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నొవోటెల్ కు వెళ్తారు. ఆస్కార్ అవార్డు సాధించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్ తో 4 గంటల నుంచి 4.30 వరకు తేనీటి విందులో పాల్గొంటారు. 4.30 నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశమవుతారు. అనంతరం 5.15 గంలకు చేవెళ్ల సభకు బయల్దేరుతారు. చేవెళ్ల సభలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Go Back to Shorts
Amit Shah
BJP
Hyderabad
RRR
Tollywood

More Telugu News