100 మిలియన్స్ ప్లస్ వ్యూస్ ను కొల్లగొట్టిన 'పుష్ప' గ్లింప్స్!
- షూటింగు దశలో 'పుష్ప 2'
- రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- సినిమాపై పెరుగుతున్న అంచనాలు
- ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమా
ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ .. 3.3 మిలియన్ ప్లస్ లైక్స్ ను సంపాదించుకుంది. గ్లింప్స్ తోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలైందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రావు రమేశ్ .. సునీల్ .. ఫహాద్ ఫాజిల్ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.