Mahesh Babu: నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న మహేశ్ బాబు!

  • త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న మహేశ్ బాబు 
  • ఆయన జోడీకడుతున్న శ్రీలీల
  • ఫారిన్ కి వెళ్లి వచ్చిన మహేశ్ బాబు 
  • ఈ శుక్రవారం నుంచి నెక్స్ట్ షెడ్యూల్ 
  • వచ్చే సంక్రాంతికి విడుదల
Trivikram and Mahesh Movie Update

మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రీలీల అలరించనుంది. 

ఈ సినిమా షూటింగు ఈ మధ్యనే మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత బ్రేక్ ఇవ్వడంతో, మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన ఆయన, ఈ రోజునే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. 

ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'సర్కారువారి పాట' తరువాత మహేశ్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 

More Telugu News