'బలగం' షూటింగు కోసం ఇల్లు ఇస్తే వేణు థ్యాంక్స్ కూడా చెప్పలేదంటున్న ఇంటి ఓనర్!

Balagam movie update
  • సిరిసిల్ల పరిసరాల్లో జరిగిన 'బలగం' షూటింగ్
  • అనూహ్యమైన విజయాన్ని సాధించిన సినిమా 
  • పాప్యులర్ అయిన అక్కడి లొకేషన్స్ 
  • కథకి తగినట్టుగా ఆకట్టుకున్న అక్కడి ఇళ్లు
ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమై .. భారీ లాభాలను సాధించిన సినిమాగా 'బలగం' కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు అంతా కూడా 'సిరిసిల్ల' పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ జరిపిన లొకేషన్స్ కూడా పాప్యులర్ కావడం విశేషం. అలాంటి లొకేషన్స్ లో హీరో ఇల్లు కూడా ఒకటి. షూటింగు కోసం ఈ ఇంటిని ఇచ్చిన రవీంద్రరావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'బలగం' సినిమా డైరెక్టర్ వేణు మా ఊరు వాడే. ఇట్లా దిల్ రాజుగారు ఒక ఛాన్స్ ఇచ్చారు .. హెల్ప్ చేయండి అని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలా పదిహేను రోజుల పాటు ఈ ఇంట్లో షూటింగు చేశారు. అప్పటివరకూ మేము వేరే ఇంట్లో ఉన్నాము. వేణు దగ్గర మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని మేము అనుకోలేదు. ఈ సినిమాలో మా ఇల్లు ఉండటం మాకు సంతోషాన్ని కలిగించింది" అన్నారు. 

"ఈ సినిమా షూటింగు సమయంలో దిల్ రాజు గారు ఇక్కడికి రాలేదు. ఆయన కూతురు .. తమ్ముడి కొడుకు మాత్రం వచ్చారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తరువాత వేణు థ్యాంక్స్ చెప్పలేదు .. ఫోన్ కూడా చేయలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది గానీ .. మేము గుర్తుకురాలేదు. ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా. ఈ  సినిమా కోసం ఇష్టంగా ఇల్లు ఇచ్చాను అంతే. అందువలన ఎలాంటి పబ్లిసిటీని నేను కోరుకోవడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Priyadarshi
Kavya
Venu
Balagam Movie

More Telugu News