Sanjay Dutt: బాంబు పేలుడు సన్నివేశాలను షూట్ చేస్తుండగా సంజయ్ దత్ కు గాయాలు

  • బెంగళూరులో షూటింగ్ సందర్భంగా సంజయ్ దత్ కు ప్రమాదం
  • చేయి, మోచేయి, ముఖానికి గాయాలు
  • ప్రమాదం జరగడంతో ఆగిపోయిన షూటింగ్
Sanjay Dutt injured in shooting

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. కన్నడ సినిమా 'కేడీ' షూటింగ్ లో బాంబు పేలుళ్ల దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంజయ్ దత్ చేయి, మోచేయి, ముఖానికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంజయ్ దత్ గాయపడటంతో షూటింగ్ ను ఆపివేశారు. బెంగళూరులోని మగడి రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా నటిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 'కేజీఎఫ్ 2' చిత్రంలో కూడా సంజయ్ దత్ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

More Telugu News