Samantha: థియేటర్లలో ఈ వారం సినిమాలు.. ఓటీటీలో ఈ వారం సిరీస్ లు ఇవే!

  • పాన్ ఇండియా సినిమాగా ఈ నెల 14న వస్తున్న 'శాకుంతలం' 
  • ఈ నెల 14వ తేదీ నుంచి 'ఆహా'లో 'దాస్ కా ధమ్కీ' స్ట్రీమింగ్ 
  • అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'జూబ్లీ సీజన్ 2'
  • జీ 5 నుంచి అదే రోజున వస్తున్న 'మిసెస్ అండర్ కవర్'
OTT Movies Releasing in this Week

శుక్రవారం వస్తుందనగానే ఇటు థియేటర్స్ లో ఏ సినిమాలు వస్తున్నాయి? అటు ఓటీటీ సెంటర్స్ కి ఏ సినిమాలు వస్తున్నాయి? అనే విషయంలో అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. థియేటర్స్ విషయానికి వస్తే ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో 'శాకుంతలం' సినిమా థియేటర్స్ లో దిగిపోనుంది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

ఇక అదే రోజున లారెన్స్ 'రుద్రుడు' .. సూరి 'విడుదల' రిలీజ్ కానున్నాయి. ఈ రెండూ కూడా తమిళం నుంచి వచ్చిన అనువాదాలే. ఆల్రెడీ తమిళనాట 'విడుదల' భారీ వసూళ్లను రాబట్టగా, 'రుద్రుడు' మాత్రం తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా ఇదే రోజున రానుంది. లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. 

ఇక ఓటీటీ విషయానికి వస్తే .. ఈ నెల 13వ తేదీన ' ఓ కల' అనే తెలుగు సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున 'అసలు' తెలుగు సినిమా 'ఈటీవీ విన్' ద్వారా పలకరించనుంది. ఈ సినిమాలో రవిబాబు - పూర్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 14 నుంచి 'ఆహా' ద్వారా 'దాస్ కా ధమ్కీ' పలకరించనుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ లో 'జూబ్లీ' ( వెబ్ సిరీస్) సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. జీ 5లో 'మిసెస్ అండర్ కవర్' హిందీ మూవీ కూడా అదే రోజున స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News