Dalai Lama: దలైలామా వివాదాస్పద చర్య.. తీవ్ర విమర్శలు!

Dalai Lamas video asking boy to suck his tongue goes viral sparks outcry
  • ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన బాలుడిని ముద్దు పెట్టమన్న దలైలామా
  • తర్వాత బాలుడి పెదవులను ముద్దుపెట్టుకున్న మతగురువు
  • తన నాలుకను నోటితో తాకాలని అడిగిన వైనం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్..
టిబెట్ బౌద్ధ మత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా చేసిన పని వివాదాస్పదమైంది. తీవ్ర విమర్శలకు దారి తీసింది. తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని దలైలామా కోరడం.. బాలుడి పెదవులపై ముద్దు పెట్టడం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దలైలామా తీరుపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఓ కార్యక్రమంలో దలైలామా.. తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన భారతీయ బాలుడిని తనను ముద్దు పెట్టాల్సిందిగా కోరారు. తర్వాత బాలుడి పెదవులపై ముద్దుపెట్టి నవ్వారు. తన నాలుకను బయటపెట్టి.. ‘నీ నోటితో నా నాలుకను తాకుతావా’ అని అడగడం వినిపించింది. దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్న వారంతా నవ్వడం, చప్పట్లు కొట్టడం వినిపించింది.

ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? అంటూ మండిపడుతున్నారు. ‘పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది? ఆయన్ను అరెస్టు చేయాలి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
Dalai Lama
Can you suck my tongue
Tibetan spiritual leader
controversy

More Telugu News