24/7 నిబంధన అన్ని దుకాణాలకు వర్తించదు.. స్పష్టతనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
- ఇటీవల జీవో నంబరు 4ను విడుదల చేసిన ప్రభుత్వం
- దుకాణాలను 24 గంటలు తెరిచిపెట్టుకునే నిబంధన అన్నింటికీ వర్తించదని స్పష్టీకరణ
- ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు ఈ జీవో వర్తించదన్న కార్మిక శాఖ కార్యదర్శి
ఇప్పుడీ విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని మరింత స్పష్టతనిచ్చారు. జీవో నంబరు 4 కింద ఇచ్చిన 24 గంటలు దుకాణాలు తెరిచి పెట్టుకునే నిబంధన ఆటోమెటిక్‌గా అన్నింటికీ వర్తించదన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే దుకాణాలను 24 గంటలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఈ జీవో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదన్నారు. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారం మాత్రమే తెరిచి ఉంటాయని రాణి కుముదిని తెలిపారు.