Allu Arjun: అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం

Allu Arjun special look in Pushpa 2 out bow
షార్ట్స్‌లో చూడండి
పుష్ప-2 ద రూల్ హవా మొదలైందన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప-2 చిత్రం నుంచి తన లుక్ ను బన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్ చూస్తేనే పుష్ప-2లో బన్నీ పాత్ర తీవ్రత ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. కాళీమాత అవతారాన్ని తలపించే వేషధారణతో అల్లు అర్జున్ లుక్ బీభత్సంగా ఉంది. 

మెడలో నిమ్మకాయల దండ, మెడలో హారాలు, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, జాకెట్, చీరకట్టి అపర కాళిలా రౌద్రం ఉట్టిపడేలా ఉన్నాడు. ఒకచేతిలో తుపాకీ పుష్ప క్యారెక్టర్ ను చాటుతోంది. అటు, పుష్ప-2 ద రూల్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కేవలం 4 గంటల వ్యవధిలో 4.12 లక్షల మంది వీక్షించారు.
Go Back to Shorts
Allu Arjun
Look
Pushpa-2 The Rule
Kali Matha
Tollywood

More Telugu News