తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి
- 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 92 తగ్గింపు
- గృహ వినియోగ సిలిండర్ ధరలో లేని మార్పు
- ఢిల్లీలో రూ. 2,028కి తగ్గిన 19 కేజీల సిలిండర్ ధర
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర గతేడాది నాలుగుసార్లు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 25 పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో ధర రూ.1,768కి చేరుకుంది. గత నెలలో రూ. 350 పెరగడంతో ధర రూ. 2,120కి చేరుకుంది. ఇప్పుడు రూ. 92 తగ్గడంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,028కి దిగొచ్చింది. కోల్కతాలో రూ. 2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ. 2,192.50గా ఉంది.