కూతురు వామిక గురించి తొలిసారి మాట్లాడిన కోహ్లీ

Virat Kohlis phone is full of photos of his daughter
  • తన ఫోన్ నిండా ఆమె ఫొటోలే ఉన్నాయన్న క్రికెట్ స్టార్
  • వామిక మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్న కోహ్లీ, అనుష్క
  • ఐపీఎల్16వ సీజన్ కు సిద్ధమైన ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్
టీమిండియా సూపర్ స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ ముద్దుల కూతురు వామికను మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఓసారి స్టేడియంలో ఉన్నప్పుడు అనుష్క, వామిక దృశ్యాలు టీవీలో కనిపించాయి. దాంతో, తమ కూతురు ముఖాన్ని చూపెట్టవద్దంటూ మీడియాకు కోహ్లీ, అనుష్క విజ్ఞప్తి చేశారు. వామిక గురించి ఎప్పుడూ మాట్లాడని విరాట్ తొలిసారి ఆమె గురించి చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫోన్ కుమార్తె వామిక ఫొటోలతో నిండిపోయిందని చెప్పాడు.

 ‘ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్’తో చాట్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఈ విషయం వెల్లడించాడు.  తన ఫోన్ గ్యాలరీ మొత్తం వామిక చిత్రాలే ఉన్నాయన్నాడు. ‘వామిక ఫొటోలు చాలా తీశాను. వామిక, అనుష్కతో పాటు మా ఇంట్లోని పెట్ (కుక్క) ఫొటోలు కూడా తీశాను’ అని కోహ్లీ తెలిపాడు. చాన్నాళ్లు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2021 లో వామిక జన్మించింది.
Advertisement
Team India
Virat Kohli
Anushka Sharma
daughter
photos

More Telugu News