Charan: చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు స్పెషల్ సీడీపీ రిలీజ్!

  • ఈ నెల 27వ తేదీన చరణ్ బర్త్ డే 
  • అప్పుడే అభిమానుల్లో మొదలైన సందడి
  • స్పెషల్ షోస్ దిశగా 'ఆరెంజ్' మూవీ    
  • ముగింపు దశలో ఉన్న శంకర్ సినిమా 
  • లైన్లోనే ఉన్న గౌతమ్ తిన్ననూరి  
Charan Birthday Special

ఈ నెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు. ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టినరోజు ఇది. అందువలన ఈ సారి ఆయన బర్త్ డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. 

చరణ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. రేపు సాయంత్రం 6 గంటలకి స్పెషల్ సీడీపీ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక 26 .. 27వ తేదీల్లో చరణ్ మూవీ 'ఆరెంజ్' స్పెషల్ షోస్ వేస్తున్నారు. 

ప్రస్తుతం చరణ్ .. శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కియారా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News