Mohan Babu: మనోజ్ పెళ్లి గురించి అంతకుమించి మాట్లాడను: మోహన్ బాబు

Mohan Babu Interview
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో మోహన్ బాబు సినిమాల సంఖ్యని తగ్గించారు. తన స్థాయికి తగిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతున్నారు. అలాగే రాజకీయాలపై కూడా ఆయన పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు. ఇటీవల మనోజ్ రెండో పెళ్లి సందర్భంలో, ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన  ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. 

అందుకు మోహన్ బాబు స్పందిస్తూ .. " మనోజ్ నా దగ్గరికి వచ్చి,  డాడీ .. ఇదీ పరిస్థితి .. చేసుకోవాలని ఉంది అన్నాడు.  ఆలోచించారా అన్నాను .. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నాడు. అయితే అలాగే కానీ .. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను .. కాదని ఎందుకు అంటాను? 

ఈ విషయంలో ఎవరో ఏదో రాశారనీ .. ఏదో అనుకుంటున్నారని ఆలోచించడం నాకు అలవాటు లేదు. వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి .. మొరగనీ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు? వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Go Back to Shorts
Mohan Babu
Actor
Tollywood

More Telugu News