Krishna District: బైక్‌పై ప్రియురాలి షికార్లు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

  • కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వెలుగు చూసిన ఘటన
  • ప్రియురాలు కొత్త బైక్‌పై తన కళ్లముందే చక్కర్లు కొట్టడంతో యువకుడి మనస్తాపం
  • పద్ధతి మార్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతికి బెదిరింపు
  • ప్రియురాలు లెక్కచేయకపోవడంతో యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
  • 80 శాతానికి పైగా శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమం 
Krishna district youth set himself ablaze after lover ignores his requests to stop riding bike

తన ఎదురుగానే ప్రియురాలు కొత్త బైక్‌పై షికార్లు కొట్టడం చూసి మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో ఉండే బవర్ సింగ్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీ దుకాణం నడుపుతున్నాడు. అతని రెండో కుమారుడు శైలేష్ సింగ్ స్థానికంగా ఉన్న యువతిని ప్రేమిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అతడి ప్రియురాలు ఇటీవలే కొత్త బైక్ కొని తన ముందే షికార్లకు వెళ్లిరావడం ప్రారంభించింది. ఇది శేలష్‌కు నచ్చలేదు. ఈ విషయాన్ని అతడు పలుమార్లు ఆమెకు చెప్పినా యువతి లెక్కచేయలేదు. 

ఆదివారం సాయంత్రం శైలేష్ తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమె పదే పదే తనముందే ఇలా బైక్‌పై తిరిగితే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఆమె బదులివ్వడంతో మనస్తాపానికి గురైన శైలేష్ సింగ్ ప్రియురాలి ఇంటివద్దే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఎనభై శాతానికి పైగా శరీరం కాలిపోయింది. శైలేష్ పరిస్థితి విషమించడంతో న్యాయమూర్తి అతడి నుంచి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం శైలేష్‌ను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

More Telugu News