ఈ విషయం నరేశ్ కు అర్థం కావడంలేదు: పవిత్రా లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ విషయం నరేశ్ కు అర్థం కావడంలేదు: పవిత్రా లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర

Pavitra Lokesh ex husband talks about Naresh
  • నరేశ్, పవిత్రా లోకేశ్ మధ్య ప్రేమాయణం
  • ఇటీవల రచ్చకెక్కిన వైనం
  • ఓ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవిత్ర మాజీ భర్త
  • పవిత్ర డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుందని వెల్లడి
  • నరేశ్ వెనుక ఉన్న రూ.1500 కోట్ల ఆస్తిపై కన్నేసిందని వివరణ
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది నటి పవిత్రా లోకేశ్ సాన్నిహిత్యం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. తాజాగా, పవిత్రా లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి పవిత్రా లోకేశ్ అని సుచేంద్ర ప్రసాద్ అన్నారు. పవిత్రకు డబ్బే ముఖ్యమని, ఇప్పుడు నరేశ్ తో ఆమె ప్రేమాయణం వెనుక కూడా డబ్బే కారణమని తెలిపారు. 

నరేశ్ వెనుక ఉన్న రూ.1500 కోట్ల ఆస్తిపై పవిత్ర కన్నేసిందని, అందుకే అతడ్ని ప్రేమ ఉచ్చులోకి లాగిందని వివరించారు. ఈ విషయం నరేశ్ కు అర్థం కావడంలేదని అన్నారు. పవిత్రా లోకేశ్ ఎలాంటి వ్యక్తో నరేశ్ కు కూడా త్వరలోనే అర్థమవుతుందని భావిస్తున్నానని తెలిపారు. 

తనకు, అంతకుముందున్న మరో భర్తకు కూడా పవిత్రా లోకేశ్ విడాకులు ఇచ్చింది డబ్బు పిచ్చి వల్లనే అని సుచేంద్ర ప్రసాద్ వివరించారు. ఓ తమిళ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Suchendra Prasad
Pavitra Lokesh
Naresh
Tollywood

More Telugu News