రేపు ‘కబ్జా’ విడుదల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపేంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు ‘కబ్జా’ విడుదల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపేంద్ర

kannada actor upendra visited tirumala
  • ‘కబ్జా’ దర్శకుడు చంద్రుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఉపేంద్ర
  • శ్రీనివాసుడి ఆశీర్వాదం కోసమే వచ్చానని వెల్లడి
  • ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. భారతీయ చలనచిత్ర రంగానికే గర్వకారణమని వ్యాఖ్య
విలక్షణ నటుడు ఉపేంద్ర నటించిన సినిమా ‘కబ్జా’. పాన్ ఇండియా స్థాయిలో రేపు ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఉపేంద్ర దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘కబ్జా’ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

దర్శనం తర్వాత ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని ఉపేంద్ర తెలిపారు.

కబ్జా సినిమాలో ఉపేంద్రతోపాటు కన్నడ సూపర్ స్టార్లు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించారు. రేపు ఈ సినిమా పలు భాషల్లో విడుదలవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కేజీఎఫ్ సినిమా స్థాయిలో విజువల్స్ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Advertisement
upendra
Tirumala
kabzaa
kicha sudeep
shiva raj kumar

More Telugu News