'మిథునం' సినిమా నిర్మాత ఆనందరావు మృతి

Tollywood producer Ananda Rao passes away
  • డయాబెటిస్ తో బాధపడుతూ ఆనందరావు మృతి
  • ఆయన వయసు 57 సంవత్సరాలు
  • 'మిథునం'కి నంది అవార్డును గెలుచుకున్న నిర్మాత  
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా నిర్మాత మొయిద ఆనందరావు కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. చాలా కాలం నుంచి ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో ఆయన వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న కన్నుమూశారు. ఆయనకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్షిలతో తెరకెక్కిన 'మిథునం' అనే సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన అంత్యక్రియలు వావిలవలసలో ఈరోజు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Go Back to Shorts
Ananda Rao
Tollywood
Producer
Mithunam Movie

More Telugu News