సమంత పోస్టుకు బదులిచ్చిన కోహ్లీ అర్ధాంగి

 Anushka Sharma replies to Samantha post in Instagram
  • మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత
  • మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్
  • పూజా మందిరంలో ఉన్న ఫొటో పోస్టు చేసిన సమంత
  • రిప్లయ్ ఇచ్చిన అనుష్క శర్మ
ప్రమాదకర మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ మునుపటిలా చురుగ్గా మారుతోంది. సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్టులు పెడుతూ అభిమానులను పలకరిస్తోంది. తాజాగా, అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం చేస్తున్న ఫొటోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. 

"మనం ఎంత బలవంతులమైనా కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కోలేం. అలాంటప్పుడు మనపై మనకున్న నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. నమ్మకం మీకు ప్రశాంతతను ఇస్తుంది... నమ్మకం మీకు అన్నీ నేర్పిస్తుంది... నమ్మకం మీకు నేస్తంగా మారుతుంది. నమ్మకం మిమ్మల్ని ఓ మహత్తరమైన శక్తిగా మార్చుతుంది" అని సమంత తన పోస్టులో వివరించారు. 

ఈ పోస్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అర్ధాంగి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా స్పందించారు. సమంత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు "యెస్" అంటూ ఆ పోస్టుకు బదులిచ్చారు.
Advertisement
Samantha
Post
Anushka Sharma
Instagram

More Telugu News