హెచ్3ఎన్2 వైరస్ తో భారత్ లో తొలి మరణం
- హర్యానా, కర్ణాటకలలో ఇద్దరి మృతి
- కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల వెల్లడి
- దేశవ్యాప్తంగా 90కి పైగా వైరస్ బాధితులు
అదేవిధంగా ఎనిమిది మంది హెచ్1ఎన్1 వైరస్ బారినపడ్డారని వెల్లడించాయి. ఫ్లూ బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోందని, అందులో చాలా వరకు హంకాంగ్ ఫ్లూ గా పిలిచే హెచ్3ఎన్2 బాధితులేనని వైద్యులు తెలిపారు. ఈ కొత్త వైరస్ సోకిన వాళ్లలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
వీటికి అదనంగా వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మిగతా అనారోగ్యాల బారిన పడ్డ వారిలోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చని, అయితే వారం పైగా ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని చెప్పారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.