విద్యార్థులకు విష ప్రయోగంపై ఇరాన్ ప్రభుత్వం సీరియస్.. వారికి మరణశిక్ష ఖాయమని హెచ్చరిక
- ఇరాన్‌లో మూడు నెలలుగా బాలికలపై విష ప్రయోగం
- అమ్మాయిలను విద్యకు దూరం చేయడంలో భాగంగానే ఘటనలు
- దర్యాప్తు జరపాలని అధికారులకు సుప్రీం లీడర్ అయతొల్లా ఆదేశం
తాజాగా ఆయన జాతీయ టీవీ చానల్‌లో మాట్లాడుతూ.. విష ప్రయోగ ఘటనలపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని తేలితే దోషులను క్షమించవద్దని, వారికి మరణదండన విధించాలని ఆదేశించారు. కాగా, మూడు నెలల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయతొల్లా స్పందించి ఈ హెచ్చరిక జారీ చేశారు. కాగా, అధికారుల దర్యాప్తులో అనుమానాస్పద నమూనాలను సేకరించామని, ప్రజలు సంయమనం పాటించాలని ఇరాన్ అంతర్గత మంత్రి అహ్మద్ వాహిద్ కోరారు.