సోదరులకు ఆస్తి దక్కకుండా భలే ప్లాన్.. భార్యను మళ్లీ పెళ్లాడుతున్న నటుడు!
- అప్పట్లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం
- కుమారులు లేకపోవడంతో ఆస్తిలో మూడో వంతు సోదరులకు చెందే అవకాశం
- ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం నేడు పునర్వివాహం
- ఫలితంగా ఆస్తి మొత్తం కుమార్తెలకు
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రత్యేక వివాహం చట్టం కింద వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఉదయం 10 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తి మొత్తం కుమార్తెలకే దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.