'బలగం'పై నాకు విశ్వాసం ఉంది: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బలగం'పై నాకు విశ్వాసం ఉంది: కేటీఆర్

Balagam Pre Release Event
  • సిరిసిల్లలో జరిగిన 'బలగం' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్
  • తెలంగాణ యాసకి దక్కుతున్న గౌరవం పట్ల హర్షం 
  • తెలుగు సినిమా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని వెల్లడి
దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందిన 'బలగం' సినిమా మార్చి 3వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 'సిరిసిల్ల'లో జరిగింది. ఈ స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. 'బలగం' సినిమా ద్వారా బలమైన మానవ సంబంధాలను వేణు అద్భుతంగా ఆవిష్కరించాడనే విషయం నాకు అర్థమవుతోంది. దిల్ రాజు గారి పిల్లలు ఇలాంటి సినిమాల ద్వారా కొత్త టాలెంటును ప్రోత్సహించాలని కోరుతున్నాను" అన్నారు. 

సి.నారాయణ రెడ్డి వంటి వారు పుట్టిన గడ్డ ఇది. ఇక్కడి నుంచి ఎంతోమంది కళాకారులు ప్రపంచానికి పరిచయమయ్యారు. ఒకప్పుడు తెలంగాణ యాసను మాట్లాడటానికి చాలామంది మొహమాటపడేవారు. అలాంటిది ఇప్పుడు చాలామంది స్టార్స్ సినిమాల్లో తెలంగాణ యాస మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

"కేసీఆర్ గారు ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించడం వలన, ఇక్కడి కళాకారులకు అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా తెలుగు సినిమాకి చేయవలసింది ఇంకా చాలా ఉంది. తప్పకుండా చేస్తాము. 'బలగం' సినిమాలో పల్లె సంస్కృతిని .. పల్లె మాటను .. పాటను గొప్పగా చూపించారు. ఈ సినిమాపై నాకు విశ్వాసం ఉంది. మీరంతా ఈ సినిమా చూడాలి. తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
Priyadarshi
Kavya
Balagam Movie

More Telugu News