తెలంగాణ నేపథ్యంలో నడిచే 'బలగం' .. ట్రైలర్ రిలీజ్!
- దిల్ రాజు బ్యానర్లో నిర్మితమైన 'బలగం'
- ప్రియదర్శి జోడీగా కావ్య కల్యాణ్ రామ్
- ప్రత్యేక ఆకర్షణగా భీమ్స్ అందించిన బాణీలు
- మార్చి 3వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ ప్రాంతంలో .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. హీరో - హీరోయిన్ మధ్య ప్రేమ .. హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం .. ఆయన టెన్షన్ పడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
పల్లె అందాలు .. అక్కడి మనుషుల ఆత్మీయత .. వాళ్ల మాట తీరును ప్రతిబింబించేదిగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ఇంతవరకూ తన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.