హైదరాబాదులో తుపాకీతో కాల్చుకున్న వైద్యుడు... చికిత్స పొందుతూ మృతి
- పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకున్న డాక్టర్ మజారుద్దీన్
- అపోలో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- చికిత్స పొందుతూ మృతి
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
పోస్టుమార్టం నిమిత్తం డాక్టర్ మజారుద్దీన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వియ్యంకుడు అని తెలుస్తోంది. ఆసుపత్రికి వద్దకు అక్బరుద్దీన్ కూడా వచ్చారు.