రామ్ చరణ్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. చరణ్ స్పందన ఇదే!
- 'ఆర్ఆర్ఆర్'తో ఒక రేంజ్ కు వెళ్లిపోయిన చరణ్ ఇమేజ్
- చరణ్ ను గ్లోబల్ స్టార్ అన్న ఆనంద్ మహీంద్రా
- ప్రతి రంగంలో ఇండియా మెరుస్తోందన్న చరణ్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా ఐదు అవార్డులను కొల్లగొట్టడంతో 'ఆర్ఆర్ఆర్' పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు నాటునాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత సింగర్లు రిహాన్నా, లేడీ గాగా పాటలతో ఇది పోటీ పడుతోంది.